Headlines

హైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ – కొత్త మార్గాలు ప్రకటించిన అధికారులు

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించే దిశగా కీలక నిర్ణయం వెలువడింది. మెట్రో రైలు విస్తరణ 2వ దశకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా ప్రకటించిన మార్గాలలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నర్సింగ్ హోమ్స్ ప్రాంతం, పాతబస్తీ కనెక్టివిటీ, ఏరోసిటీ–శంషాబాద్ రూట్లు ఉండనున్నాయి. ఈ విస్తరణ పూర్తయ్యితే ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభం కానుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం…

Read More

అఖండ 2 సినిమా మొదటి రోజూ ఎంత కలెక్ట్ చేసిందంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లపై కొంత ప్రభావం పడిందని చెప్పాలి. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు భావించినా, మేకర్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు దాదాపు…

Read More

తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసిన నవీన్ యాదవ్

ఈ రోజు ఎక్కడ చూసిన నవీన్ యాదవ్ అనే పేరు ఎక్కువగా వినబడుతోంది. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి చెరగని ముద్ర వేసుకున్నారు. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే. యాదవ సముదాయానికి చెందిన ఆయన…

Read More

అఖండ 2 రివ్యూ. బాలయ్య శివ తాండవం సినిమాకి ప్లస్ అయిందా?

ఇప్పటి ప్రేక్షకుల సినిమా చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ఎక్కడా లాజిక్కులు కనిపించకూడదు, సన్నివేశాల్లో తప్పులు ఉండకూడదు, కథ పర్‌ఫెక్ట్‌గా ముందుకు సాగాలి. ఇదే వారి కొత్త ప్రమాణం. కానీ ఈ ప్రమాణాలు బాలయ్య–బోయపాటి కాంబినేషన్ సినిమాలకు మాత్రం వర్తించవు. ఎందుకంటే ఈ కాంబో స్క్రీన్‌పై కనిపిస్తే లాజిక్ కన్నా భావోద్వేగం, మాస్, ఎనర్జీ కనిపిస్తాయి. బాలయ్య ఎంట్రీ అయిన క్షణం థియేటర్ వాతావరణం మారిపోతుంది, ప్రేక్షకులు పూనకాల్లోకి వెళ్లిపోతారు. సింహా నుండి లెజెండ్‌, అక్కడి నుంచి…

Read More

టైటిల్ అనౌన్స్మెంట్ లో ఎమోషనల్ అయిన మహేష్ బాబు

నవంబర్ 15 రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లో మహేష్ బాబు తన స్పీచ్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఈవెంట్ లో ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివిల్ చేశారు. ఈ సినిమా టైటిల్ లాంచ్ రివీల్ కోసం ఈ ఈవెంట్ ను నిర్వహించారు. ఫైనల్ గా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘వారణాసి’ గా వీరిద్దరూ కాంబో లో తెరకెక్కుతోంది.50,000 మంది అభిమానుల మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో…

Read More

‘అఖండ 2’ ఎందుకు ఆగిపోయింది? విడుదల వాయిదా వెనుక నిజమైన కారణాలు ఇవే..

‘అఖండ 2’ సినిమాను డిసెంబర్ 5, 2025న గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అభిమానులు భారీ ఎగ్జైట్మెంట్‌తో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ విడుదలకు కేవలం ఒక రోజు ముందు—డిసెంబర్ 4న—నిర్మాతలు అర్ధరాత్రి సమయంలో ఒక ప్రకటన విడుదల చేసి, “అనివార్య పరిస్థితులు” కారణంగా సినిమా విడుదల వాయిదా పడిందని తెలిపారు. థియేటర్లలో పెట్టిన అన్ని షోలు రద్దయ్యాయి, బుకింగ్లు నిలిపివేయబడ్డాయి. దీనితో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోయిందో ఎవరికి…

Read More

హైపర్ ఆది కామెడీపై ఇంద్రజ ఘాటు వ్యాఖ్యలు.. ఎక్కడో ఓ ఈగో కనిపిస్తోంది!

జబర్దస్త్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది, ఇప్పుడు టీవీ షోలు, సినిమాలు అన్నీ కలిపి బిజీ శెడ్యూల్‌తో దూసుకుపోతున్నాడు. స్కిట్స్‌లో పంచులు వేయడంలో, టెంపో పెంచడంలో అతను టాప్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇదే స్టైల్ వల్ల కొన్ని విమర్శలు కూడా ఆది వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కువగా బాడీ షేమింగ్ కామెడీ చేయడం, ఎదుటివారిని తక్కువ చేసే డైలాగ్స్ వేయడం, అప్పుడప్పుడు లిమిట్ దాటే అడల్ట్ పంచులు వేయడం… ఇవన్నీ చాలామంది పాయింటెడ్ గా…

Read More

అఖండ 2 రిలీజ్ డేట్ ఇదే…

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ విడుదలపై రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అసలు ఈ సినిమా డిసెంబర్ 5నే థియేటర్లలోకి రావాల్సి ఉండేది. కానీ లాస్ట్ ముమెంట్‌లో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ ఒకేసారి బ్రేక్‌ అయ్యింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది— “ఇప్పుడీ సినిమా ఎప్పుడొస్తుంది? సంక్రాంతికీ మారుతుందా? లేక ‘హరిహర వీరమల్లూ’ లాగా వారం వారం వాయిదా పడుతూ పాత సినిమా అయ్యిపోతుందా?” అన్న టాక్ మొదలైంది. ఇప్పుడు తాజా సమాచారం…

Read More

ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం

వైద్య విద్యా రంగంలో పెద్ద నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా 35 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ఆమోదం తెలిపింది. వైద్య సీట్ల సంఖ్య పెరగడం ద్వారా భవిష్యత్తులో వైద్యుల కొరత తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త కాలేజీల్లో ఆధునిక ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలు, నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీతో పాటు టెలీ–మెడిసిన్…

Read More

బిగ్ బాస్ సీజన్ 9 విజేత కామనర్‌గా వచ్చి చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన విజేత పేరు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నది ఎవరో సెలబ్రిటీ కాదు… ఓ కామనర్. అదే ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. వేలాది దరఖాస్తులను దాటి, కఠినమైన అగ్నిపరీక్షల్లో నిలబడి హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్… మొదటి నుంచే…

Read More