ఈ సీజన్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ గురించి మాట్లాడితే… కేవలం ఐదు వారాల వరకే నిలబడగలిగే రేంజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు? అని అడిగితే చాలామంది ఒకే పేరు చెబుతారు – సుమన్ శెట్టి.
హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే సుమన్ శెట్టి గేమ్ చాలా వీక్‌గానే కనిపించింది. మధ్యమధ్యలో కొన్ని కామెడీ పంచులు, అప్పుడప్పుడూ ఒకటి రెండు టాస్కుల్లో మెరుపులు చూపించినా… ఓవరాల్‌గా చూస్తే మిగిలిన వాళ్లతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాడన్న అభిప్రాయం ఆడియన్స్‌లో బలంగా ఉంది. అసలు మొదటి వారం ఎలిమినేట్ అయిన శ్రేష్టి వర్మ కూడా సుమన్ శెట్టికన్నా బెటర్ కంటెస్టెంట్ అని చెప్పుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది.
అయినా కూడా ఇన్ని వారాలు ఆయన హౌస్‌లో కొనసాగడానికి కారణం గేమ్ కాదు… మనిషి స్వభావం. మంచోడు, అమాయకుడు, ఎవరి మీద కుట్రలు చేసే టైపు కాదు, కన్నింగ్ ఆలోచనలు లేవు – ఈ లక్షణాలే ఆయనకు ఆడియన్స్ ఓట్లు తెచ్చిపెట్టాయి. “గేమ్ ఎలా ఉన్నా మనిషి మంచివాడు” అనే సింపతి ఓటింగ్ ఆయనను చాలా దూరం తీసుకొచ్చింది.
దీనికి తోడు మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే… ఇమ్మానుయేల్ దాదాపు 11 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం. దాంతో ఓటింగ్ మొత్తం సుమన్ శెట్టివైపే ఎక్కువగా పడింది. నిజానికి గత వారమే ఆయన ఎలిమినేట్ కావాల్సింది. కానీ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ మారడంతో రీతూ చౌదరి ఎలిమినేషన్ జరిగింది. అదే విషయం సుమన్ శెట్టికి పెద్ద నెగటివ్‌గా మారింది.
టాప్ 5లోకి వెళ్లే అన్ని అర్హతలు ఉన్న రీతూను బయటకు పంపి, సుమన్ శెట్టిని ఎలా కొనసాగిస్తారు? ఇదేం న్యాయం? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఎఫెక్ట్ ఈ వారం స్పష్టంగా కనిపించింది. ఎట్టకేలకు ఇప్పుడు సుమన్ శెట్టి ఎలిమినేషన్ ఖరారైనట్టే సమాచారం.
శనివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని, ఆదివారం ఎపిసోడ్‌లో సంజన లేదా భరణిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.


