
బాలీవుడ్‌లో విడాకుల ఊసులు ఆగేలా లేవు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖుల వ్యక్తిగత జీవితం చర్చల్లోకి రావడంతో, సినీ దంపతులపై మీడియాలో ఊహాగానాల వెల్లువ కనిపిస్తోంది. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం — అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ దాంపత్యంపై వస్తున్న రూమర్లు.
2024 నుంచి ఈ జంట విడిపోతున్నారనే వార్తలు తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా, వారిద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై స్పష్టమైన ప్రతిస్పందన ఇవ్వలేదు. దీంతో పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పుడు అభిషేక్ బచ్చన్ నిశ్శబ్దాన్ని చెరిపి, ఈ చర్చలపై మొదటిసారిగా స్పందించారు.
అభిషేక్ చెప్పినదేమిటంటే.. ఐశ్వర్యకు సినిమా ఇండస్ట్రీపై అపారమైన గౌరవం ఉన్నది. అదే విలువలను ఆరాధ్యకు కూడా నేర్పుతుంటుంది. అందుకే మీడియాలో ఏం వచ్చినా ఆరాధ్య వాటిని వినగానే ప్రశ్నలు వేసే వయసుకు చేరింది. రూమర్ అంటే ఏమిటి, నిజం ఏది, అబద్దం ఏది? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఆరాధ్య మొబైల్ ఫోన్ వాడదని, ఆమెకు ఫోన్ కూడా లేదని అభిషేక్ స్పష్టం చేశారు. ఎవరైనా ఆమెతో మాట్లాడాలంటే ఐశ్వర్య ఫోన్‌కి కాల్ చేస్తారని చెప్పారు. ఇంటర్నెట్ ఉన్నా, అది పూర్తిగా హోంవర్క్ కోసమే బాలీవుడ్ గాసిప్స్ కోసం కాదు అని ఆయన నవ్వుతూ తెలిపారు.
తమ దాంపత్యంపై వస్తున్న విడాకుల వార్తలు ఆరాధ్యను ఏమాత్రం ప్రభావితం చేయవని అభిషేక్ చెప్పారు. “ఆమెకు అలాంటి విషయాల్లో ఆసక్తి లేదు. మా మధ్య విభేదాలు ఉన్నాయనే మాటను ఆమె నమ్మదు కూడా. కుటుంబం అన్న విషయానికి మా కూతురు ఎంత సీరియస్‌గా చూస్తుందో నాకు తెలుసు,” అని అన్నారు.
తల్లిదండ్రుల నుండి వచ్చిన కుటుంబ విలువలను ఆరాధ్య కూడా అదే స్థాయిలో కొనసాగిస్తోందని, ఎప్పుడూ తన కుటుంబానికి అండగా నిలుస్తుందని అభిషేక్ వెల్లడించారు


