
జబర్దస్త్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది, ఇప్పుడు టీవీ షోలు, సినిమాలు అన్నీ కలిపి బిజీ శెడ్యూల్‌తో దూసుకుపోతున్నాడు. స్కిట్స్‌లో పంచులు వేయడంలో, టెంపో పెంచడంలో అతను టాప్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇదే స్టైల్ వల్ల కొన్ని విమర్శలు కూడా ఆది వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కువగా బాడీ షేమింగ్ కామెడీ చేయడం, ఎదుటివారిని తక్కువ చేసే డైలాగ్స్ వేయడం, అప్పుడప్పుడు లిమిట్ దాటే అడల్ట్ పంచులు వేయడం… ఇవన్నీ చాలామంది పాయింటెడ్ గా చెప్పే విషయాలే.
ఇప్పుడు ఈ విషయంపైనే నటి ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది గురించి మాటలు చెప్పింది. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందిన ఇంద్రజ, ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు టీవీ షోలలో జడ్జిగా బిజీగా ఉంది. ఇంద్రజ – ఆది ఇద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె చెప్పిన మాటల్లో ఆది మీద ఓ చిన్న ఫైర్, ఓ పెద్ద అర్థవంతమైన కామెంట్ ఉంది. “స్కిట్స్‌లో ఒకరిపై ఒకరం పంచులు వేయడం నార్మల్‌నే. పంచ్ వేయడం కామెడీ, అదే సమయంలో అవి మనపై పడితే తీసుకోవడం కూడా కామెడీలో భాగమే. కానీ ఆది మాత్రం మాకు పంచులు వేస్తాడు, మేము వేస్తే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతాడు. ఏదో ఒక కారణం చెబుతాడు. ఇది చాలా చెత్తగా ఉంటుంది. కొంచెం ఈగోకు తగిలిపోతుంది” అని చెప్పింది.
ఆది చేసే కామెడీలో ఎక్కువగా అమ్మాయిల మీద, వారి రూపం మీద పంచులు ఉంటాయని, అవన్నీ పాత జోక్స్ అని కూడా ఇంద్రజ నేరుగా చెప్పింది. “ఆది మీద పంచ్ వేస్తే కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు. కానీ అతను అర్థం చేసుకోడు” అని వ్యాఖ్యానించింది. అయితే ఇదంతా చెప్పినా… వ్యక్తిగతంగా ఆది మీద గౌరవం ఉందని, అతను చాలా మంచి వర్క్-మైండెడ్ వ్యక్తి అని కూడా ఇంద్రజ చెప్పింది. “సపోర్ట్ ఏమీ లేకుండా ఓ గ్రామం నుంచి వచ్చి, ఇంత పెద్ద స్థాయికి వచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. ఎవరికైనా ఈవెంట్ వచ్చే అవకాశం వస్తే, తాను చేయలేకపోతే ఇన్‌స్టంట్‌గా ఇంకొకరికి చెప్తాడు. వేరే వాళ్లను కూడా పనులకి తీసుకెళ్తాడు. అలా చాలా మందికి హెల్ప్ చేస్తాడు” అని ఆమె క్లియర్‌గా చెప్పింది.
మొత్తం మీద… ఇంద్రజ మాటల్లో ఆది మీద చిన్న క్రిటిసిజం ఉన్నా, చివరికి ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం పెద్దది—
ఆది ఈగో ఉన్నా ఉండొచ్చు, పంచులు తీసుకోలేకపోయినా ఉండొచ్చు… కానీ వర్క్ విషయంలో, మనుషులను సపోర్ట్ చేయడంలో అతను


