ప్రభాస్–అనుష్కల పెళ్లి… టాలీవుడ్ మొత్తం ఒకే ఫ్రేమ్‌లో!

Share the post

ఈ రోజుల్లో ఏది చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముందు మనుషులు కూడా ఆగి చూడాల్సిందే! విద్య నుంచి వైద్యం వరకు, సినిమాల నుంచి సోషల్ మీడియా వరకు—ప్రతి రంగాన్ని ఏఐ గట్టిగానే షేక్ చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కలలా అనిపించిన టెక్నాలజీ, ఇప్పుడు సామాన్యుల రోజువారీ జీవితంలోకే చొరబడి ఊపిరిపీల్చుకుంటోంది.

ఇదిలా ఉండగా, నెటిజన్లకు ఏఐ అంటే కేవలం టెక్నాలజీ కాదు… ఒక ఆటబొమ్మలా మారిపోయింది. హీరోలు, హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు తీసుకుని ఇష్టానుసారం మార్చేయడం, ఎడిట్ చేసి వైరల్ చేయడం.ఇది వాళ్లకు ఈజీ టైమ్ పాస్ అయిపోయింది. అంతేకాదు… తమ ఫేవరెట్ స్టార్లకు పెళ్లిళ్లు, ఫ్యామిలీ, పిల్లలు అన్నీ AIతో రెడీ చేసి చూపించడం ఇప్పుడు కామన్.

గతంలో ప్రభాస్–అనుష్కలకు ఏఐతో పెళ్లి చేసి, “వాళ్ల పిల్లలు ఇలా ఉంటారు” అంటూ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాను ముంచెత్తారు. ఆ ఫోటోలను చూసిన అభిమానులు “ఇది నిజమై ఉండే బాగుండే” అని కామెంట్లతో జల్లు కురిపించారు.

ఇప్పుడు… అదే జంట పెళ్లిని మరోసారి AIతో గ్రాండ్‌గా జరిపేశారు! ఈ సారి అదీ అదిరిపోయే స్థాయిలో టాలీవుడ్‌ మొత్తం ఒకే వేదికపై కనిపించేలా వీడియో తయారు చేశారు.

ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కల్యాణ్‌, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, అల్లు అర్జున్, రవితేజ, నాని వరకు… టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ‘హాజరయ్యారు’! కాజల్, తమన్నా, సమంతా వంటి హీరోయిన్లు పెళ్లి మండపం చుట్టూ సందడి చేస్తూ కనిపిస్తున్నారు.

మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పసందుగా అటెండ్ అవుతుంటే… నాగార్జున–నాని సన్నాయి అందిస్తారు. అల్లు అర్జున్, రవితేజ స్టేజ్ దగ్గర డ్యాన్స్‌తో హీట్ పెంచేస్తారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటల్లో బిజీగా ఉండగా, గోపిచంద్ అతిథులకు భోజనం వడ్డిస్తూ దర్శనమిస్తాడు. చిరంజీవి–పవన్ కల్యాణ్ బంతి భోజనంలో చిరునవ్వులు చిందిస్తారు. బాలయ్య అయితే డప్పు కొడుతూ ఊరేగింపు మూడ్‌లో దుమ్మురేపేస్తాడు!

“ప్రభాస్–అనుష్కల పెళ్లి… అందరూ ఆహ్వానితులే!” అని ఒక నెటిజన్ షేర్ చేసిన ఈ ఏఐ వీడియో నెట్లో ఇప్పుడు టాప్ ట్రెండింగ్. దీన్ని చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క మాటే చెబుతున్నారు.“ఇది నిజమైతే బాగుండు అని”



Share the post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *