టైటిల్ అనౌన్స్మెంట్ లో ఎమోషనల్ అయిన మహేష్ బాబు

Share the post

నవంబర్ 15 రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లో మహేష్ బాబు తన స్పీచ్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఈవెంట్ లో ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివిల్ చేశారు.

ఈ సినిమా టైటిల్ లాంచ్ రివీల్ కోసం ఈ ఈవెంట్ ను నిర్వహించారు. ఫైనల్ గా టైటిల్ అనౌన్స్ చేశారు. ‘వారణాసి’ గా వీరిద్దరూ కాంబో లో తెరకెక్కుతోంది.
50,000 మంది అభిమానుల మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు తన భావోద్వేగాలు, రాజమౌళితో పని చేసిన అనుభవాలు, తండ్రి కృష్ణ గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడాడు.

హాయ్ అండ్ హెలో టు ఎవరీబడీ! (అభిమానులు ‘జై బాబు, జై జై బాబు’ అని అరుస్తూ ఉంటే…) వావ్, ఈ ఎనర్జీ… ఈ లవ్… ఇది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మూమెంట్. మీరు అందరూ ఇక్కడికి వచ్చి, ఈ రాత్రిని స్పెషల్ చేశారు. థ్యాంక్యూ సో మచ్! ఈ సినిమా (‘వారణాసి’) గురించి మాట్లాడాలంటే… రాజమౌళి గారు నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చినప్పటి నుంచి, ఇది కేవలం ఒక సినిమా కాదు – ఇది ఒక అడ్వెంచర్, ఒక జర్నీ. మేము అంటార్కిటికా నుంచి ఆఫ్రికా వరకు, ప్రాచీన భారతీయ సంస్కృతి మైథాలజీని కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం. రాజమౌళి గారు చెప్పినట్టు, ఇది రామాయణం నుంచి ప్రేరణ పొందిన ఒక ఎపిక్ సీక్వెన్స్. నేను రాముడి రూపంలోకి వచ్చినప్పుడు, అది కేవలం షూట్ కాదు – అది ఒక స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్. గూస్‌బంప్స్ వచ్చాయి, మరి మీరు చూస్తే ఏమవుతుందో ఊహించండి. (తండ్రి కృష్ణా గారి గుర్తు చెప్పుతూ…) నాన్నా, నువ్వు ఇక్కడ లేకపోయినా, నీ లైట్ నన్ను ఎల్లప్పుడూ గైడ్ చేస్తోంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు, నీవు ప్రౌడ్‌గా ఉండేవని ఫీల్ అవుతున్నాను. థింకింగ్ ఆఫ్ యూ ఎ లిటిల్ మోర్ టుడే. (భావోద్వేగంగా…) ఈ జర్నీలో నా ఫ్యామిలీ – నమ్రత, సితారా – మీ అండ… అందరూ నా బలం. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్… మీతో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాజమౌళి గారు, మీరు కేవలం డైరెక్టర్ కాదు. మీరు విజనరీ. ఈ సినిమా 2027 సమ్మర్‌లో వస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. జై బాబు! థ్యాంక్యూ!” అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.


Share the post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *