
ఈ రోజు ఎక్కడ చూసిన నవీన్ యాదవ్ అనే పేరు ఎక్కువగా వినబడుతోంది. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి చెరగని ముద్ర వేసుకున్నారు. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే. యాదవ సముదాయానికి చెందిన ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సోషల్ వర్కర్‌గా పేరుగాంచిన వ్యక్తి. నవీన్ యాదవ్ తెలంగాణ త్రోబాల్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
2025లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్‌కు జరిగిన ఉప ఎన్నికకు అక్టోబర్ 8న ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అక్టోబర్ 17న షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 13న జరిగిన ఓట్లు లెక్కింపులో మొదటి రౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంతో మొదలై, చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఈ అసాధారణ విజయాన్ని చారిత్రాత్మకంగా పేర్కొన్నారు.


